: ఇదో కొత్త జబ్బు


ఇప్పటికే పలురకాలైన జబ్బులతో మానవ జీవితం సతమతమవుతోంటే... మరో కొత్త జబ్బును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ జబ్బును తొమ్మిదేళ్ల పిల్లాడిలో కనిపెట్టారు. జన్యువులో లోపం మూలంగా మన శరీరానికి అవసరమైన విటమిన్‌ను మనం తీసుకున్నా... మన శరీరం మాత్రం దాన్ని గ్రహించకుండా విసర్జిస్తుంది. ఇలాంటి ఒక కొత్త జబ్బును శాస్త్రవేత్తలు గుర్తించారు.

కొలరాడో విశ్వవిద్యాలయం, కొలరాడో పిల్లల ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృదం తొమ్మిదేళ్ల పిల్లాడు మాక్స్‌ వాట్సన్‌ శరీరంలో తొలిసారిగా కొత్త తరహా జబ్బును గుర్తించారు. ఈ జబ్బు లక్షణమేమంటే శరీరం తనకు అవసరమైన విటమిన్‌ బి12ను గ్రహించే సామర్ధ్యం లోపించడం. ఈ కొత్త రకమైన జబ్బు వాట్సన్‌కు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. మన శరీరం బి12ను గ్రహించేందుకు సాయం చేసే ఎంజైము పనితీరును నియంత్రించే జన్యువులో లోపాలు ఉన్న కారణంగా ఈ జబ్బు వస్తున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News