: ఇది మన గుట్టు విప్పి చెబుతుంది


మనం ఏం తిన్నాం... ఎలాంటి మందులు వాడుతున్నాం... మనం రోజూ ఎలాంటి కాలుష్య కారకాల ప్రభావానికి గురవుతున్నాం... ఇలాంటి పలు విషయాలను మనం తెలుసుకోవాలంటే అనేక రకాలైన పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది కదూ... అయితే ఈ విషయాలన్నింటినీ మన మూత్రం చెప్పేస్తుందట. ఎందుకంటే మన మూత్రంలో వేల సంఖ్యలో రసాయనాలున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అల్బెర్టా విశ్వవిద్యాలయంలో పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో మానవుడి మూత్రంలో సుమారుగా మూడువేల రసాయనాలు (జీవక్రియ కారకాలు) ఉన్నట్టు తేలింది. సుమారు ఇరవైమంది పరిశోధకులు ఏడేళ్లపాటు నిర్విరామంగా కృషి చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పటి వరకూ మూత్రంలో ముప్ఫై వరకూ రసాయనాలు ఉన్నట్టు తెలుసు. అయితే పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంతో వీటి జాబితా మరింతగా విస్తరించింది. మూత్రంలోని ఈ రసాయనాల ద్వారా సదరు వ్యక్తుల ఆరోగ్యం గురించే కాదు... వారు ఎలాంటి ఆహారం తింటున్నారు... ఏం తాగారు... ఎలాంటి మందులు వాడుతున్నారు... ఏయే కాలుష్యాల ప్రభావానికి గురయ్యారు... ఇలా అనేక విషయాలను గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News