: కేంద్ర హోంమంత్రి షిండేకు విజయమ్మ లేఖ
రాష్ట్ర విభజనపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజయమ్మ ఆ లేఖలో డిమాండ్ చేశారు. 60 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సీపీఎం, ఎంఐఎం తో పాటు తమ పార్టీ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఓట్లు ,సీట్ల కోసమే కేంద్రం ఈ విభజన నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.