: మహిళా లిఫ్టర్లపై లైంగిక వేధింపులు
లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు క్రీడాకారిణులకూ సర్వసాధారణమైపోతున్నాయి. తాజాగా చత్తీస్ గఢ్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణులు తమను లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ సాహు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తమను అతని గదికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడని వారు మీడియాకు తెలిపారు. అంతేగాకుండా తమ ప్రైజ్ మనీలో కమీషన్ అడుగుతాడని వెల్లడించారు. చాన్నాళ్ళుగా అతడి దాష్టీకాన్ని భరిస్తున్నామని, తాము ఈ విషయాలు ఎవరికైనా చెబితే, డోపింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నాడని వారు వాపోయారు. కాగా, తనపై లిఫ్టర్లు చేసిన ఆరోపణలను సాహు ఖండించారు. అవన్నీ రాజకీయాలని కొట్టిపారేశారు.