: హైకోర్టు వద్ద మాపై దాడి అమానుషం: సీవీ మోహన్ రెడ్డి
హైకోర్టు వద్ద తమపై తెలంగాణ న్యాయవాదులు చేసిన దాడి అమానుషమని సీవీ మోహన్ రెడ్డి అన్నారు. సీమాంద్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సీవీ మోహన్ రెడ్డి లాయర్లపై జరిగిన దాడిని ఖండించారు. తమపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, చివరకు తమపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ న్యాయవాదులతో పోలీసులు కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని మండిపడ్డ ఆయన, మహిళా న్యాయవాదులపై కూడా అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.