: మొరాయించిన ట్రాఫిక్ సిగ్నల్స్.. నిలిచిన వాహనాలు
హైదరాబాదులోని ఉప్పల్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ మొరాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చౌరస్తాకు నలువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తుండగా, మెకానిక్ లు సిగ్నల్స్ కు మరమ్మతులు చేస్తున్నారు.