: ఏపీఎన్జీవోలకు విశాలాంధ్ర మహాసభ మద్దతు
హైదరాబాదులో రేపు జరగనున్న ఏపీఎన్జీవో సభకు విశాలాంధ్ర మహాసభ మద్దతు తెలిపింది. సమైక్యాంధ్రను కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు హాజరుకాలేకపోయినా స్టేడియం వరకు రావాలని విశాలాంధ్ర మహాసభ నేతలు కోరారు. హైదరాబాదులో సమైక్యాన్ని కోరుకునే హైదరాబాద్ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాము చూసుకుంటామని, నిర్భయంగా సభకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే హైకోర్టులో ఇరు ప్రాంతాల న్యాయవాదుల మధ్య ఘర్షణ పూర్తి హేయమైన చర్య అని దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన న్యాయస్థానంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం బాధాకరమని, ఇవి పునరావృతమైతే అరాచకానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.