: ఫేస్ బుక్, ట్విట్టర్లో ఏపీఎన్జీవోల సభకు 'పవనిజం'


ఏపీఎన్జీవోలు పవన్ కల్యాణ్ సినిమా డైలాగును సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కోసం వాడుకున్నారు. తమ సభకు సంబంధించి ఏపీఎన్జీవోలు వినూత్న తరహాలో ప్రోమోను రిలీజ్ చేశారు. దీనిపై భారీ స్పందన లభిస్తోంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కల్యాణ్ అత్యంత భావోద్వేగంగా చెప్పిన భారీ డైలాగ్ ను ఏపీఎన్జీవోలు వాడారు. 'ఎముకలు కుళ్లిన, వయసులు మళ్లిన సోమరులారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా.. రక్షించు నా దేశాన్ని.. అని తిలక్ ఏడ్చాడ్రా. వాడినాపడానికి నేను వెళుతున్నా, రేపు నువ్వు వస్తున్నావ్.. మనిద్దరం కలసి వెళుతున్నాం, వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేమీ లేదురా బానిస సంకెళ్లు తప్ప.. హైదరాబాద్ నడిబొడ్డున వెయిట్ చేస్తున్నాను రా.. రా..' అంటూ పవన్ కల్యాణ్ భావోద్వేగంతో చెప్పిన డైలాగు అందరినీ అలరిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ డైలాగులు హల్ చల్ చేస్తున్నాయి. వీటికి భారీ స్పందన కూడా లభిస్తోంది.

  • Loading...

More Telugu News