: ఫోర్జరీ కేసులో కాంగ్రెస్ నేతకు సమన్లు
ఓ ఫోర్జరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. వివాదాస్పద ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మకు కూడా ఇదే కేసులో సమన్లు జారీ చేశారు. వీరిద్దరినీ ఈ నెల 30లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. వ్యాపార ప్రయోజనాల కోసం 2009లో తన లెటర్ హెడ్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ వర్మ, టైట్లర్ పై కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుకావడంతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.