: మోడీకే సీఈవోల ఓటు
కార్పొరేట్, వ్యాపార సంస్థల సీఈవోలలో అత్యధికులు దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే మోడీవైపే మొగ్గుచూపుతున్నారని ఓ సర్వే పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వారు పేర్కొన్నారు. మోడీ అయితేనే ప్రస్తుత పరిస్థితిని మార్చగల సమర్ధుడని వారు నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా 100 మంది సీఈవోలతో ఎకనామిక్ టైమ్స్, నీల్సన్ సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో కేవలం 7 శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచారు. మన్మోహన్ సింగ్ ఇక తప్పుకోవడమే మంచిదని వారు సూచించినట్టు ఒపీనియన్ పోల్ తెలిపింది.