: సభ జరుపుకునేవారు సంయమనం పాటించాలి: జానా


రేపు హైదరాబాదులో ఏపీఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరుపుకొంటుండగా.. మంత్రి జానా రెడ్డి పలు సూచనలు చేశారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఆవేశాన్ని పక్కనబెట్టి శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలన్నారు. రెచ్చగొట్టే విధానాలకు తావీయరాదని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాజకీయ జేఏసీ రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా, తెలంగాణకు అభ్యంతరం లేదని చెప్పిన పార్టీలు విభజన ప్రకటన అనంతరం బాణీ మార్చి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ నిర్ణయం హఠాత్తుగా జరిగిందని దుష్ప్రచారం చేస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయినా జాతిగా కలిసుండాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News