: తెలంగాణ బంద్ కు బీజేపీ మద్దతిచ్చింది: నాగం
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వ్యతిరేకంగా టీజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు బీజేపీ మద్దతిచ్చిందని ఆ పార్టీనేత నాగం జనార్ధనరెడ్డి తెలిపారు. సీమాంధ్ర నేతలు కుట్రచేసి ఎన్జీవోల చేత పెట్టిస్తున్న సభకు తాము సమ్మతం తెలపబోమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు చేపడతున్న ఇలాంటి సభకు ఎందుకు మద్దతివ్వాలని నాగం ప్రశ్నించారు.