: బాబు బస్సుయాత్రకు టీడీపీ తెలంగాణ నేతల దన్ను
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో చేస్తున్న బస్సు యాత్రకు ఆ పార్టీ తెలంగాణ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, టీఆర్ఎస్ సంయుక్త కుట్రను ఎండగట్టేందుకే బాబు బస్సు యాత్ర చేస్తున్నారని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కవడం మూలంగా తెలంగాణలో ఎందరో బలయ్యారని ఆరోపించారు. 2014 వరకు తెలంగాణ రాకూడదన్నది కేసీఆర్ ఆకాంక్ష అని విమర్శించారు. తెలంగాణ కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటుంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి విలీనం ప్యాకేజిలు మాట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబ లబ్ది కోసమే తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.