: న్యాయవాదుల మధ్య ఘర్షణ దురదృష్టకరం: మంత్రి ఏరాసు


హైకోర్టులో న్యాయవాదుల మధ్య ఘర్షణ దురదృష్టకరమని రాష్ట్ర న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతాల పెద్దమనుషులు కూర్చుని చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. నేతలు ఎన్ని చెప్పినా ఆంటోనీ కమిటీ నోరు మెదపడం లేదని, కమిటీ తీరు 'మోనాలిసా' చిత్రంలా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమస్యను నాన్చడం సరికాదని అన్నారు. 'హైదరాబాద్ పదేళ్లు రాజధాని, పోలవరం ప్రాజెక్టు' అనేసి చేతులు దులుపుకున్నారని, ఇక్కడ పరిస్థితులు చూస్తే వాస్తవమేంటో తెలుస్తుందని విమర్శించారు. సీమాంధ్ర రాజధాని, రాయలసీమ సాగునీరు, ఉద్యోగాలు వంటి అంశాల్లో స్పష్టత ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదని ఏరాసు విమర్శించారు.

  • Loading...

More Telugu News