: స్వాతంత్ర్య పోరాటం తరువాత జరుగుతున్న అతి పెద్ద ఉద్యమం: కొనకళ్ల


సీమాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతోందని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మాట్లాడుతూ, ఉభయ సభలు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించాయని అన్నారు. ఇంతవరకు కనీవినీ ఎరగని రీతిలో స్వాతంత్ర్యపోరాటం అంతటి తీవ్రమైన ఉద్యమం జరుగుతోంటే పాలక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు ప్రజావాణి వినిపిస్తుంటే పది రోజుల పాటు సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము ఉద్యమాన్ని వీడలేదని, సభ వెలుపలి నుంచే తమ నిరసన కార్యక్రమాలు చేశామని అన్నారు. తమను సభ నుంచి బయటికైతే పంపారు కానీ, ఎంపీలను కలసి తమ వాదన వినిపించడాన్ని అడ్డుకోలేకపోయారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News