: ప్రజా ఉద్యమంపై స్పందించాల్సింది పాలకులే: ఎంపీ నిమ్మల కిష్టప్ప


ప్రజా ఉద్యమానికి పాలకులెవరైనా సరే సమాధానం చెప్పాల్సిందేనని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 13 జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళనతో భారీ ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు స్వాతంత్ర్యోద్యమమంతటి తీవ్ర ఉద్యమాలు జరుగుతున్నాయని, వాటిని గుర్తించని ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పొరపాటుగా చేసిన స్టేట్ మెంట్ వెనక్కి తీసుకోండంటూ పార్లమెంటులో ప్రజావాణి వినిపిస్తుంటే తమ గొంతు నొక్కేశారని విమర్శించారు. ఇకపై ప్రజల్లోకి వెళ్ళి వారితోనే ఉద్యమం చేస్తామని, కాంగ్రెస్ నేతల భవిష్యత్ ను ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News