: పోప్ వ్యాఖ్యలను స్వాగతించిన బాన్ కీ మూన్
సిరియా విషయంలో పోప్ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్వాగతించారు. సిరియాపై యుద్ధానికి అమెరికా సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో.. చర్చల ద్వారా శాంతిస్థాపనకు ప్రయత్నించాలని పోప్ కోరారు. ఒక రోజు నిరాహార దీక్షకు కూడా పిలుపునిచ్చారు. వీటిని స్వాగతిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఒక ప్రకటన జారీ చేశారు.