: ఏపీఎన్జీవోల సభలో నేతలకు అనుమతి లేదు: పోలీసులు
రేపు మధ్యాహ్నం హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించనున్న సభకు హాజరయ్యేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రజా ప్రతినిధులు సహా నేతలు ఎవరైనా వస్తే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. సభకు కేవలం ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కార్డును తీసుకురావాలని సూచించారు. ఇతరులు సభా ప్రాంగణానికి రావాలని ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అందుకు నిర్వాహకులదే బాధ్యతని స్పష్టం చేశారు. అన్నింటినీ పరిశీలించిన మీదటే సభకు అనుమతి ఇచ్చామని, అదే రోజు కాకుండా మరో రోజు ర్యాలీ పెట్టుకుంటే అనుమతిస్తామంటూ తెలంగాణ జేఏసీని ఉద్దేశించి అన్నారు.