: తెలంగాణకు వ్యతిరేకంగా పెట్టే సభకు మేం వ్యతిరేకం: ఈటెల
'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఈ నెల 7న ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సభపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వెళ్లగక్కారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నిర్వహించే సభకు తాము వ్యతిరేకమని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఆంధ్రా ఉద్యోగులు, సంఘాలను కోరామన్నారు. ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యలపై మండిపడ్డ ఈటెల ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిటీ కళాశాల నుంచి ఇందిరాపార్కు వరకు శాంతి ర్యాలీకి అనుమతి కోరితే సర్కారు నిరాకరించిందన్న ఆయన టీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కోరారు. ముఖ్యమంత్రి తీరుపై మంత్రులు స్పందించకపోతే చరిత్ర హీనులవుతారని హెచ్చరించారు.