: ఉద్యోగుల భవిష్యనిధి సేవలు నేటి నుంచి ఆన్ లైన్లో
నేటి నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) సేవలు ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల సేవలను ఆన్ లైన్లో పొందవచ్చు. ఇప్పటి వరకు ఉద్యోగుల పీఎఫ్ ఖాతా వివరాలు ఏడాదికోసారి మాత్రమే ఆన్ లైన్లో అప్ డేట్ చేసేవారు. కానీ, ఇక నుంచి ఎప్పటికప్పుడు వారి ఖాతా సమాచారాన్ని ఆన్ లైన్లో అప్ డేట్ చేస్తామని ఈపీఎఫ్ఓ కమిషనర్ జలాన్ తెలిపారు.