: రాష్ట్రంలో పలు చోట్ల ఆగిన 'తుఫాన్'
రామ్ చరణ్ హీరోగా నటించిన 'తుఫాన్' చిత్ర ప్రదర్శనకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆటంకాలు ఏర్పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డి గూడెం, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా తిరుపతి, కర్నూలు జిల్లా నంద్యాల, నెల్లూరు జిల్లా వెంకటగిరి, విశాఖ జిల్లా నర్సీపట్నంలో చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. పలు చోట్ల సమైక్యవాదులు అడ్డుకోవడంతో థియేటర్ల యజమానులు ప్రదర్శనను నిలిపివేశారు. అటు తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, నిజామాబాద్ లోనూ ఆందోళనకారులు థియేటర్ల వద్ద బ్యానర్లను చించివేసి నిరసనకు దిగడంతో చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది.