: ఇది లేకపోతే అండాశయ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువే


అండాశయ క్యాన్సర్‌ వ్యాధిని కలిగించే ప్రధానమైన జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళల్లో వుండాల్సిన ఒక సాధారణ జన్యువు లేని కారణంగా అండాశయ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువవుతుందని లండన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.

హెల్క్‌ అనే ఒక జన్యువు సాధారణంగా డీఎన్‌ఏ దెబ్బతింటే మరమ్మత్తు చేయడంలో తోడ్పడుతుంది. ఒకవేళ ఈ జన్యువు లేకపోయినా, లేక లోపభూయిష్టంగా ఉన్నా కూడా డీఎన్‌ఏలో లోపాలు తలెత్తుతాయి. ఇది క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. శాస్త్రవేత్తలు హెల్క్‌ జన్యువు ప్రతులు లేని ఎలుకల్లో అండాశయ క్యాన్సర్‌ కణితులు ఏర్పడే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కేవలం హెల్క్‌ జన్యువు ప్రతి, ఒకటి లేకపోయినా కూడా ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్‌ కణితులు ఏర్పడుతున్నాయని, మనుషుల్లోనూ ఈ జన్యువు ఇలాంటి ప్రభావాన్నే చూపుతుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News