: ఒత్తిడి పెరిగితే మతిమరుపు ఎక్కువే


సాధారణంగా మనలో చాలామంది విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇలా చిన్న విషయాలకు కూడా ఒత్తిడికి లోనయ్యేవారికి భవిష్యత్తులో అల్జీమర్స్‌ (మతిమరుపు) వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కుంగుబాటు, ఆందోళన, ఇతర మానసికపరమైన సమస్యలు అల్జీమర్స్‌ను మరింత వేగవంతం చేస్తాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.

అల్జీమర్స్‌కు ఇతర కారణాల విషయాన్ని పక్కనబెడితే కుంగుబాటు, మానసికపరమైన ఆందోళన, ఇతర మానసిక సమస్యలు ఈ వ్యాధిని మరింత వేగవంతం చేస్తున్నట్టు పరిశోధనలో తేలింది. వీటన్నింటికీ దోహదం చేసే కేబీపీ51 అనే ప్రోటీను ఈ మతిమరుపు జబ్బును మరింత వేగవంతం చేస్తున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రోటీను హెచ్‌ఎస్‌పీ90 అనే మరో ప్రోటీన్‌తో కలిసి మెదడులో పోగుపడే విషపూరిత టావు ప్రోటీనును బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అల్జీమర్స్‌ బాధితుల మెదడులో ఈ టావు ప్రోటీను పోగుపడుతుందని, వయసుతోబాటే ఎఫ్‌కేబీపీ51 ప్రోటీను స్థాయిలు కూడా పెరుగుతాయని, ఇది హెచ్‌ఎస్‌పీ90 ప్రోటీనుతో కలిసి టావు ప్రోటీనును మరింత ప్రాణాంతకంగా మారుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ ఒత్తిడికి, ఆందోళనకు లోనుకాకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.

  • Loading...

More Telugu News