: ఎవరికీ హాని కలుగకుంటే ఓకే!


మనం చేసే పనిని బట్టి, ఒక్కో పని చేసే సమయంలో దానికి అనుగుణంగా మన మనసులో భావనలు ఏర్పడుతుంటాయి. అయితే ఇతరులకు హాని కలిగించని అనైతిక పనులను చేసే సమయంలో తమ పనుల వల్ల ఇతరులకు హాని కలుగదు అనే భావం వల్ల ఆ పనులను చేసే వారి మనసులో ఒక రకమైన సానుకూల భావన కలుగుతుందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు అమెరికా, ఇంగ్లాండులోని వెయ్యిమందికి పైగా వాలంటీర్లపై చేపట్టిన పరిశీలన ద్వారా ఇతరులకు నేరుగా హాని కలిగించని అనైతిక, మోసపూరితమైన చర్యలకు పాల్పడేవారిలో ఒక రకమైన సానుకూల భావన కలుగుతుందని తేలింది. మోసపూరితమైన చర్యలకు పాల్పడినప్పుడు కొంతమందిలో ఇలాంటి చర్యలు ప్రతికూల ప్రభావం కలిగించినా, చాలామందిలో ప్రతికూల భావన కలుగదని ఈ పరిశోధనలో తాము గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నికోలే రుయెడీ మాట్లాడుతూ మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నవారు తమ పనుల వల్ల ఎవరికీ హాని కలుగడంలేదనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు పాల్పడుతుంటారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News