: ఉద్యమానికి మా వంతు కృషి: తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టనున్న 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ ప్రకటించింది. తెలంగాణలోని పది జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం హైదరాబాద్, నారాయణ గూడలో జరిగింది. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, ఈ నెల 24న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళా అధ్యాపకుల పాత్రను పెంచి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.