: ఫేస్‌బుక్‌ రగడ


ఇప్పుడు ఫేస్‌బుక్‌లో చాలా మందికి అకౌంట్‌ ఉంటుంది. ఇందులో తమ వ్యక్తిగత వివరాలను, ఫోటోలను కూడా తమ సన్నిహితులకు, స్నేహితులకు పోస్ట్‌ చేస్తుంటారు. అయితే ఈ ఫోటోలను, వివరాలను కొన్ని ప్రాయోజిత ప్రకటనల్లో వాడుకుంటామని ఫేస్‌బుక్‌ ప్రకటించడం అమెరికాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.

వినియోగదారులు తమ చిత్రాలను, వివరాలను ఎంత మేరకు ప్రకటనల్లో వాడాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చంటూ ఫేస్‌ బుక్‌ ప్రకటించింది. ఈ విధానంపై అమెరికాలోని గోప్యతా హక్కు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వినియోగదారుల గోప్యతను తమ సొంత లాభాలకు వాడుకునే కుట్ర ఇందులో దాగివుందంటూ ఈ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ వినియోగదారులు తమకు తామే ఏ మేరకు వాడుకోవాలి? అనే విషయాన్ని నిర్ణయించుకోవచ్చని చెబుతున్నా అదంతా వట్టి అబద్ధమని విమర్శిస్తున్నాయి. ఫేస్‌బుక్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రానిక్‌ ప్రైవసీ ఇన్షర్మేషన్‌ సెంటర్‌, సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ డెమోక్రసీ తదితర హక్కుల సంఘాలు అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కు లేఖ రాశాయి.

  • Loading...

More Telugu News