: షర్మిల.. విభజనపై సోనియాను ఎందుకు విమర్శించరు?: ముద్దుకృష్ణమ
రాష్ట్ర విభజన అంశంపై వైఎస్సార్సీపీ నేత షర్మిల ఎందుకు విమర్శించడం లేదని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు. ఏపీఎన్జీవోల సభ జరిగినప్పుడే టీఎన్జీవోలు సభ నిర్వహిస్తామనడం సరికాదని తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఏపీఎన్జీవోల సభకు గుండాలు వస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు.