: భాగ్యనగరంలో సమ్మె విరమిస్తున్న ఆటో సంఘాలు
హైదరాబాద్ లో సమ్మె చేస్తున్న ఆటో సంఘాలతో రవాణా శాఖ కమిషనర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో సంఘాల డిమాండ్లపై హామీ రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు. 108 జీవో రద్దుచేసి, ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధిస్తున్న చలానా మొత్తాన్ని తగ్గిస్తామని చెప్పారన్నారు. దీనికి సంబంధించి ఐదు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారానికి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సానుకూల హామీ ఇచ్చారని, ఉత్తర్వులు రాకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.