: మా ప్రాంత సమస్యల పరిష్కారం కోసమే లేఖలు: కిశోర్ చంద్రదేవ్
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం (విజయనగరం) సమస్యలను ఆంటోనీ కమిటీ ముందుకు తీసుకువెళ్లేందుకే లేఖలు రాశానని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పారు. విభజనపై నిర్ణయం వెనక్కి తీసుకోరని తనకు తెలుసునని.. వెనక్కి తీసుకునేదిలేదని తనకు చాలాసార్లు చెప్పారన్నారు. కాబట్టే, విభజనపై ప్రజల్లో లేనిపోని ఆశలు రేకెత్తించడం ధర్మం కాదని పేర్కొన్నారు. రాజీనామాతో బెదిరింపు రాజకీయాలు చేయనన్నారు. అయితే, మఖ్యమంత్రి, కీలక మంత్రి పదవులు, పీసీసీ చీఫ్, స్పీకర్ పదవులు సీమాంధ్రులకు దక్కాయని తెలంగాణ వారిలో కసి ఉందని కమిటీకి చెప్పానన్నారు. కనీసం సీఎం, పీసీసీ పదవులు తెలంగాణ వారికి ఇచ్చివుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చివుండేది కాదని కిశోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు.