: 100 కార్లు ఢీకొని 200 మందికి గాయాలు
బ్రిటన్ లోని కెంట్ కౌంటీలో కొత్తగా నిర్మించిన ఫెప్పీ ఫోర్ లేన్ క్రాసింగ్ బ్రిడ్జి మీద ఈ రోజు ఉదయం పది నిమిషాలపాటు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్న శబ్దం తప్ప మరో శబ్దం వినపడలేదు. దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో డ్రైవర్లకు ముందు ఉన్న వాహనాలు కన్పించకపోవడమే ఇందుకు కారణం. దాదాపు పావుగంట తరువాత అక్కడ అడ్డదిడ్డంగా పడివున్న కార్లు, లారీలు కన్పించాయి. అయితే వరుసగా ఒకేసారి ఇన్ని ప్రమాదాలు జరిగినా 200 మంది స్వల్పంగా గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురికి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.