: ఉద్ధృతంగా 'లక్ష జన గళ సాగర ఘోష'
సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనలు అంబరాన్నంటుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇక్కడి ప్రజలు సమైక్యవాదాన్ని చాటుతున్నారు. తాజాగా కాకినాడలో ఏర్పాటు చేసిన 'లక్ష జన గళ సాగర ఘోష' కు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. వేలాదిగా తరలివచ్చిన సమైక్యవాదుల నినాదాలతో కాకినాడ సాగరతీరం హోరెత్తింది.