: సీఎం క్యాంపు కార్యాలయన్ని ముట్టడిస్తాం: ఆటో యూనియన్లు


రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి లక్ష్మీ పార్థసారథితో ఆటో డ్రైవర్ల యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన సమయంలో తమపై జీవో 108 ప్రకారం రూ.1000 జరిమానా విధించడడం పట్ల ఆటో డ్రైవర్లు రెండ్రోజులుగా బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సర్కారుతో చర్చలు విఫలం కావడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. జీవో 108ని వెనక్కి తీసుకునే వరకు తాము పోరాడతామని ఆటో డ్రైవర్ల సంఘాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో రేపు రవాణా శాఖ కార్యాలయాన్ని.. ఎల్లుండి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపాయి.

  • Loading...

More Telugu News