: ఏపీఎన్జీవోలకు టీఎన్జీవోల హెచ్చరిక
ఏపీఎన్జీవోలు సభ పేరుతో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తే బుద్ధి చెబుతామని టీఎన్జీవో నేతలు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాదును అశాంతి నగరంగా మార్చేందుకు ఏపీఎన్జీవోలు కుట్రలు చేస్తున్నారని, అందులో ఉద్యోగులు బలికావద్దని వారు సీమాంధ్ర ఉద్యోగులకు పిలుపునిచ్చారు. తెలంగాణ మంత్రులకు సీమాంధ్ర ప్రభుత్వంలో స్థానం లేదని తేలిందని.. ఇకనైనా వారు మేలుకోవాలని టీఎన్జీవో నేతలు హితవు పలికారు.