: శాంతి ర్యాలీ జరిపి తీరుతాం: కోదండరాం
ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, ఈ సాయంత్రం ర్యాలీ కోసం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేల్కొని ప్రకటన అమలయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సభకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని కోదండరాం విమర్శించారు. నీటి సమస్యను బూచిగా చూపి సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని కోదండరాం ఆక్షేపించారు. ఏపీఎన్జీవోలకు అనుమతిచ్చి తమకు అనుమతివ్వకపోవడం కాంగ్రెస్ దమన నీతిని చాటుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.