: ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో రాధాకృష్ణన్ జయంతి
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే సర్వేపల్లి జయంతి వేడుకల్లో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఉత్తమ బోధనల వల్లే దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని నేతలు అభిప్రాయపడ్డారు.