: మోపిదేవి మరో ప్రయత్నం
బెయిల్ కోసం మాజీమంత్రి మోపిదేవి పట్టువిడవకుండా పోరాడుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన నేడు సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.