: సోనియాకు పాక్ ప్రధాని పూలబొకే!


జమ్మూకాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్.. భారత్ తో శాంతి కోరుకుంటోందా? చూడబోతే అలాగే అనిపిస్తోంది. గతనెల 26న పార్లమెంటు సమావేశాల సమయంలో అనారోగ్యం కారణంగా హఠాత్తుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వెంటనే సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ పూలబొకే పంపాలని ఆ దేశ విదేశీ మంత్రిత్వశాఖను నిర్ధేశించారట. దాంతో, ఢిల్లీలోని తమ హై కమిషన్ కు ఆ విషయాన్ని చెప్పడంతో ఆసుపత్రికి బొకేను పంపారని జాతీయ మీడియా తెలిపింది. సోనియా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ షరీఫ్ తరపున శుభాకాంక్షలు తెలిపారని చెప్పింది.

  • Loading...

More Telugu News