: రాజ్యసభ నుంచి ఎస్పీ, జేడీయూ, వామపక్షాల వాకౌట్
రాజ్యసభ తొలి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే గుజరాత్ ఐపీఎస్ అధికారి వంజరా లేఖపై చర్చకు ఎస్పీ, జేడీయూ, వామపక్షాల సభ్యులు పట్టుబట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్.. వంజరా లేఖపై చర్చకు అనుమతించలేదు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఆజ్యం పోస్తోందని ఆరోపిస్తూ, అనుమతి నిరాకరించినందుకు నిరసనగా జేడీయూ, ఎస్పీ, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.