: అన్ని జబ్బులకూ ఒకటే మాత్ర


గుండె జబ్బు ఉంటే.. దానికి రోజూ రెండు మాత్రలు. బీపీ సమస్యకు కూడా రోజూ రెండు మాత్రలు. రక్తం గడ్డకట్టే ప్రమాదం లేకుండా యాస్పిరిన్.. ఇలా పలు సమస్యలకు పలు రకాల మాత్రలను తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కొంచెం పెద్ద వయసు వారికి పలు రకాల సమస్యలు వస్తుంటాయి. కానీ, అన్నేసి టాబ్లెట్లలో అప్పుడప్పుడూ కొన్ని మరచిపోతుంటారు. అలా మరచిపోయిన సందర్భాల్లోనే కర్మకాలి బీపీ కాస్త ప్రతాపం చూపితే మంచమెక్కాల్సిందే.

ఇలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలు, బీపీకి కలిపి ఒకే ఒక్క మాత్రను రూపొందించారు వైద్యులు. దీని పేరు పాలీపిల్. భారత్, యూరోప్ లో ఈ మాత్రపై చేసిన అధ్యయనాలలో మంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఎయిమ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చండీగఢ్ సహా 28 భారత పరిశోధనా సంస్థలు, జార్జ్ ఇనిస్టిట్యూట్ ఈ అధ్యయనంలో పాలు పంచుకున్నాయి. ఈ ఔషధ ఫార్ములాను హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ కంపెనీ రూపొందించడం మనకు గర్వకారణం.

  • Loading...

More Telugu News