: బీహార్ లో పెరుగుతున్న వరద మృతుల సంఖ్య
బీహార్లో వరదలు ప్రజలను ముంచెత్తుతున్నాయి. 20 జిల్లాలు వరద ప్రభావంతో అతలాకుతలమై మృతుల సంఖ్య పెరిగిపోతుంది. నిన్నటికి వరదల కారణంగా మరణించినవారి సంఖ్య 176కి చేరింది. భారీ వరదలతో రాష్ట్రంలోని 13 నదులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండడంతో మరో రెండు రోజుల వరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఉత్తర బీహార్ లో ఈ నెల 8 నుంచి మళ్లీ భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాదాపు 60 లక్షల మంది ప్రజలు వరద బాధితులుగా ఉన్నారు.