: 'తుఫాన్' థియేటర్లకు భద్రత కల్పించండి: హైకోర్టు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటించిన 'తుఫాన్'(హిందీలో 'జంజీర్') చిత్రం విడుదల కానున్న థియేటర్లకు భద్రత కల్పించాలని రాష్ట్ర హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు చరణ్ తొలిసారి బాలీవుడ్ లో నటించిన ఈ చిత్రం ఏకకాలంలో పలు భాషల్లో ఈ నెల 6న విడుదల కాబోతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, సీమాంధ్రలో చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటామంటూ సమైక్యాంధ్ర ఉద్యమకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలంటూ చిత్ర నిర్మాతలు వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.