: శాంసంగ్ నుంచి 'స్మార్ట్' వాచ్


స్మార్ట్ ఫోన్లలో మరో అధునాతన ఉత్పత్తిని శాంసంగ్ ఆవిష్కరించింది. యాపిల్ కంటే ముందే స్మార్ట్ వాచ్ ను 'గెలాక్సీ గేర్' పేరుతో తీసుకొచ్చింది. బెర్లిన్ లో జరుగుతున్న ట్రేడ్ ఫేర్ లో గెలాక్సీ గేర్ తోపాటు గెలాక్సీ నోట్3 స్మార్ట్ ఫోన్, గెలాక్సీ 10.1 టాబ్లెట్ ను కూడా ప్రదర్శనకు ఉంచింది. ఈ నెల 25 నుంచి 149 దేశాలలో ఇవి అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి. మనదేశంలోనూ ఈ నెల చివర్లో విడుదల చేయనుంది.

గెలాక్సీ గేర్ ను చేతికి వాచ్ లా ధరించి కాల్స్ చేసుకోవచ్చు. మెసేజులు చూసుకోవచ్చు. ఇందులో 1.9 మెగాపిక్సల్స్ కెమెరా, 1.63 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ట్విట్టర్ తోనూ అనుసంధానం కావచ్చు. ఇది స్మార్ట్ ఫోన్ కు ఎక్స్ టెన్షన్ గా పనిచేస్తుందని శాంసంగ్ తెలిపింది. యాపిల్ కూడా వచ్చే వారంలో స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించనుంది.

  • Loading...

More Telugu News