: భాగ్యనగరంలో రెండోరోజు కొనసాగుతున్న ఆటోల బంద్
ట్రాఫిక్ చలానాల మోతను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఆటోడ్రైవర్ల సంఘం చేపట్టిన ఆటోల బంద్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఆందోళన జరుగుతూనే ఉంటుందని ఆటోడ్రైవర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నగరంలో ఉన్న మొత్తం పదకొండు యూనియన్లు బంద్ కు మద్దతు ఇవ్వడంతో పాసింజర్ ఆటోలు పూర్తిగా తిరగడంలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఎక్కడైన ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేసినా, నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసినా వెయ్యి రూపాయలు వసూలు చేస్తామంటూ ప్రభుత్వం జీవో నంబర్ 108ని జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా ఆటోవాలాలు సమ్మె చేస్తున్నారు. మరోవైపు, ఆటోల బంద్ తో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.