: విషాదంలోనూ నవ్వే అధికారికి 14 ఏళ్ల జైలు
కళ్ల ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగితే.. చూసిన వారి హృదయం చలించిపోతుంది. వెంటనే అక్కడివారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కానీ, చైనాలో యాంగ్ డెకాయ్ అనే ఓ అధికారి మాత్రం కళ్ల ముందు ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసి ఫక్కున నవ్విన ఉన్మాదిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఇతడి ప్రమాదకరమైన నవ్వు ఇప్పటి విషయం కాదులెండి. అయితే తాజాగా ఇతడి అనినీతి చరిత్ర కోర్టులో నిరూపితమైంది. ప్రభుత్వ అధికారిగా ఉన్న యాంగ్ డెకాయ్ లంచాలు పుచ్చుకున్నాడని నిరూపితం కావడంతో ఆక్సియాన్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డెకాయ్ నవ్వు చూసి మండిపడ్డవారు తాజా కోర్టు తీర్పుతో చల్లబడ్డారు.