: రైల్వేల్లో ప్రమాదాల సంఖ్య తగ్గింది : రైల్వే మంత్రి
పెరిగిన ఆధునికీకరణ వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందని లోక్ సభలో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెప్పారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెడుతున్నమంత్రి.. రద్దీని తగ్గించేందుకు మరిన్ని రైళ్లు తీసుకువస్తామని తెలిపారు. టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు ఆధార్ తో అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.
సురక్షిత, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం ప్రజల హక్కు అని అన్నారు. ఎంపిక చేసిన రైళ్లలో వై ఫై (వైర్ లెస్ ఫిడెలిటీ) సదుపాయం కల్పిస్తామన్నారు. విద్యాభివృద్ధి కోసం ‘ఆజాద్’ ఎక్స్ ప్రెస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య పోరాట స్థలాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుంది.