: బ్రిటన్ పార్లమెంటులో బూతు చిత్రాల కోసం తహతహ


కామంతో తహతహలాడే వారి కళ్లు వేటిని వెతుకుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడా, ఇక్కడా అని లేదు. ఎక్కడ ఉన్నా వారి చూపు శృంగారం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాక్షాత్తూ బ్రిటన్ పార్లమెంటులో పోర్నోగ్రఫీ వీడియోలు చూసేందుకు ఏడాది కాలంలో మూడు లక్షల ప్రయత్నాలు జరిగాయట. హౌస్ ఆఫ్ కామన్స్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 మే నుంచి 2013 జూలై వరకు బ్రిటిష్ పార్లమెంటు నెట్ వర్క్ నుంచి పోర్నోగ్రఫీ వెబ్ సైట్లు చూసేందుకు ఇన్నిసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఇన్ని లక్షల పర్యాయాలు బూతు చిత్రాల కోసం అర్రులు చాచిన వారిలో ఎంపీలు, అధికారులు, సిబ్బంది ఎవరెంత మంది ఉన్నారనే విషయం వెల్లడి కాలేదు. పార్లమెంటులో 5వేల మంది పనిచేస్తుంటారు. ఇటీవలి కాలంలో కర్ణాటక అసెంబ్లీలోనూ బూతు చిత్రాలు చూసిన సంఘటనలను విన్నాం.

  • Loading...

More Telugu News