: పచ్చబొట్టుతో కొలువుకు చేటు!


చక్కటి మేనిపై కొట్టొచ్చినట్టు కనిపించే పచ్చబొట్టు వేయించుకుని అందరిలో ప్రత్యేకంగా తిరగాలని నేటి యువత తహతహలాడుతుంటుంది. అయితే ఇలా పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల వారి ఉద్యోగాలకే ఎసరు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇలా ఒంటిపై ఇష్టం వచ్చినట్టు టాటూస్‌ వేయించుకునే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి పలు సంస్థలు వెనకాడుతున్నట్టుగా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

ఉద్యోగ విజయంలో టాటూస్‌ ప్రభావం అనే అంశంపై సెయింట్‌ ఆండ్రూస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఆండ్రూ ఆర్‌.టిమ్మింగ్‌ లండన్‌లోని 14 సంస్థలకు చెందిన పలువురు మేనేజర్లతో మాట్లాడారు. ఈయన వీరితో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో టాటూస్‌ వేసుకున్న వారిని తమ సంస్థల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి చాలామంది మేనేజర్లు తటపటాయిస్తామని చెప్పారట. ముఖ్యంగా వినియోగదారులతో నిత్యం మెలగాల్సిన ఉద్యోగాల ఎంపికలో వీరిని అస్సలు పరిగణించరని ఈ అధ్యయనంలో తేలింది. టాటూలు వేసుకున్న వారు శుభ్రత లేనివారిగా, ప్రతి అంశాన్ని వ్యతిరేకించేవారిగా కనిపిస్తారని మేనేజర్లు చెప్పారట. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా దేహాన్ని పచ్చబొట్లతో కరాబు చేసుకునేముందు... మీ కొలువుకు అవేమైనా అడ్డవుతాయేమో కాస్త ఆలోచించుకుని తర్వాత టాటూలకు దేహాన్ని అప్పగించుకోండని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News