: నిద్రపోలేదా... జాగ్రత్త...


మీరు సరిగ్గా నిద్రపోవడం లేదా... అయితే జాగ్రత్త. మీరు సరిగా నిద్రపోకుంటే మీలో తొందరలో ముసలితనపు లక్షణాలు వచ్చేస్తాయట. ఈ విషయం ఊరకే చెప్పడంలేదు... దీనిపై శాస్త్రవేత్తలు బాగా పరిశోధన చేసి మరీ చెబుతున్నారు. వేళకు చక్కగా కంటినిండా కునుకుతీయని వారికి అకాల వార్ధక్యం వచ్చి పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు వేళకు సరిగ్గా నిద్రపోనివారికి అకాల వార్ధక్యం వస్తుందని చెబుతున్నారు. సరిగా నిద్రపోకపోవడం వల్ల కళ్ల కింద ఉబ్బినట్టు ఉండడం, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలతోబాటు ముఖమంతా ముడతలు పడిపోతుందని, దీంతో అసలు వయసుకన్నా కూడా ఎక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రలేమి అనేది కళ్లు, నోరు, చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని కళ్లు మూసుకుపోతున్నట్టు ఉండడం, కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడడం వంటి దుష్ప్రభావాలు కూడా నిద్రలేమి వల్ల వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వేళకు సరిగ్గా కంటినిండా నిద్రపోని కారణంగా చర్మం పాలిపోయినట్టు అయిపోతుందని, చర్మంపై ముడతలు స్పష్టంగా కనిపిస్తాయని, పెదవుల చివర్లు కిందికి సాగినట్టు అవుతాయని అందుకే కంటినిండా చక్కటి నిద్రపోవడం వీటన్నింటికీ పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి... నిద్ర వచ్చిన వెంటనే హాయిగా కంటినిండా నిద్రపోండి... ముసలి తనాన్ని కాస్త దూరంగా ఉంచండి...!

  • Loading...

More Telugu News