: నేటికీ ఒడిశాలో అంటరానితనం


ఒడిశాలో ఇప్పటికీ అంటరానితనం ఉందనడానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తాగునీటికోసం వెళ్లిన దళిత మహిళపై అగ్రవర్ణాలవారు దాడి చేయడం కలకలం సృష్టించింది. పికిరాలి గ్రామానికి చెందిన కల్పన తాగునీటి కోసం గ్రామంలోకి వెళ్లడంతో ఆమెపై గ్రామస్తులు దాడి చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు నమోదు చేశారు. ఒడిశాలో ఇప్పటికీ దళితులు గ్రామ పొలిమేరల్లోనే జీవనం సాగిస్తుండడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.

  • Loading...

More Telugu News