: 'సింహగర్జన' ఢిల్లీ వినపడుతుంది: పెంచల్ రెడ్డి
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపడుతున్న సమైక్యాంధ్ర 'సింహగర్జన' ఢిల్లీ వరకు వినపడుతుందని అదనపు జేసీ పెంచల్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సమైక్యసభకు ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష మందితో సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీ నేతలకు వినబడేలా 'సింహగర్జన' కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతలకు అతీతంగా ఏపీఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు అన్నీ తామై ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఏర్పాట్లు పూర్తయ్యాయని సభ జరగడమే తరువాయని ఆయన అన్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమైక్యవాదులతో సభ నిండిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.